చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టి టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు మారుతి. తాజాగా సాయిధరమ్ తేజ్‌తో ‘ప్రతిరోజు పండగే’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినా ఆయన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్ అలాంటి హీరోలకు కథలు వినిపించినా ఎవరూ ఆయనకు ఓకే చెప్పలేదంట. కథలు నచ్చినప్పటికీ వారంతా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో మారుతికి హామీ ఇవ్వలేకపోతున్నారంట. Also Read: కెరీర్ తొలినాళ్లలో కొత్తవాళ్లతో సెమీ అడల్ట్ సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్న మారుతి తర్వాత వెంకటేష్, నాగచైతన్య లాంటి స్టార్లతోనూ మంచి సినిమాలు తెరకెక్కించాడు. సాయిధరమ్‌తేజ్‌కు మంచి హిట్ ఇచ్చినప్పటికీ యంగ్ హీరోలు ఆయనకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. దీంతో డైరెక్షన్‌తో పాటు నిర్మాతగానూ రాణిస్తున్న మారుతి తానే సొంతంగా సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా యువతను ఆకట్టుకునేలా వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కించేలా మారుతి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jnSqw0
No comments:
Post a Comment