Thursday, December 19, 2019

`రూలర్` ట్విట్టర్‌ రివ్యూ: అభిమానులకు మాత్రమే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు దారుణమైన రిజల్ట్‌ రావటంతో అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ, కేయస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం జైసింహాకు యావరేజ్‌ టాక్‌ రావటంతో ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా బాలయ్య కూడా డిఫరెంట్ లుక్‌లో అభిమానులకు కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. స్టైలిష్‌ బిజినెస్‌మేన్‌, మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సినిమాలో రెండు వేరియేషన్స్‌ చూపించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ లుక్స్‌పై కూడా డివైడ్‌ టాక్‌ వచ్చింది. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్‌లో ఇప్పటికే రూలర్‌ ప్రీమియర్స్‌ షోస్‌ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మిడ్‌నైట్‌ నుంచే సందడి మొదలైంది. సినిమా చూసిన వాళ్లు వాళ్ల అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు డివైడ్‌ టాక్‌ వస్తోంది. అభిమానులు బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటుంటే ఇతర ప్రేక్షకులు నెగెటివ్‌ రిపోర్ట్ ఇస్తున్నారు. సినిమాలో బాలయ్య ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ సూపర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే `పడతాడు` పాటలో బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటున్నారు. ఈ సాంగ్‌కు థియేటర్లు విజిల్స్‌ పడుతున్నాయట. Also Read: తొలిభాగం ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో బోర్‌ కొట్టించాడట. లెంగ్తీ సీన్స్ కూడా సెకండ్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొంత మంది సినిమా పూర్తిగా నిరాశపరిచిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఎనర్జీ తప్ప సినిమాలో ఇంకేంలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సినిమా అంటేనే వన్‌మేన్‌ షోలా సాగుతుంది. అందుకే ఇతర పాత్రలు సన్నివేశాల గురించి ఎవరూ పెద్దగా స్పందించటం లేదు. ఓవరాల్‌గా రూలర్‌ ట్విట్టర్ టాక్‌ చూస్తే ఈ సారి కూడా బాలయ్య నిరాశపరిచాడన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. బాలయ్య మార్క్‌ రొటీన్ మాస్‌ యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు తప్ప సినిమాలో ఏం లేదంటున్నారు ఆడియన్స్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tB63Ug

No comments:

Post a Comment

Watch out - this devious new Android malware clicks on hidden browser ads to put you at risk

Malware uses AI to mimic authentic human behavior and trick traditional defenses. from Latest from TechRadar https://ift.tt/BCwJN8j