Thursday, December 19, 2019

‘ప్రతిరోజూ పండగే’ ట్విట్టర్ రివ్యూ: తేజూ పండగ తీసుకొచ్చాడా?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘చిత్రలహరి’ లాంటి డీసెంట్ హిట్ తరవాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ప్రతిరోజూ పండగే’పై అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లు ఈ సినిమాను తెరకెక్కించడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి దగ్గట్టే భారీగా ప్రచారం కూడా చేశారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో మారుతీ ఏదో కొత్తగా చూపించారనే భావన ప్రేక్షకుల్లో కలిగించగలిగారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read: ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. కథలో కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో దర్శకుడు లాక్కొచ్చేశారట. కానీ, సెకండాఫ్ మాత్రం బాగా డల్ అయిపోయిందని టాక్. మొత్తం సినిమాలో పండగ మూమెంట్స్ చాలా తక్కువేనని పెదవి విరుస్తున్నారు. సినిమాకు పాజిటివ్ ఏమైనా ఉందంటే అది ఒక్క సాయి తేజ్ మాత్రమే అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మరీ బలవంతంగా ప్రేక్షకుడిపై రుద్దినట్టు ఉన్నాయట. అలాగే, సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను సాగదీశారని అంటున్నారు. రావు రమేష్ కామెడీ సీన్లు తప్ప సెకండాఫ్‌లో ఆకట్టుకునే సన్నివేశాలు లేవట. ఫస్టాఫ్‌ను ఎంజాయ్ చేసినా సెకండాఫ్‌ను భరించడం మాత్రం చాలా కష్టమని కొంత మంది డైరెక్ట్‌గా చెబుతున్నారు. బి, సి సెంటర్లలో ఈ సినిమా ఆడటం కష్టమేనని అంటున్నారు. మారుతి ఫ్యామిలీ మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేదట. మొత్తంగా చూసుకుంటే ఇదొక యావరేజ్ ఫిల్మ్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36WeNTs

No comments:

Post a Comment

50,000 WordPress site affected in major plugin security flaw - here's how to stay safe

A popular WordPress plugin has a worrying flaw which could allow website takeover. from Latest from TechRadar https://ift.tt/kfKO7nH