Monday, January 20, 2020

‘డియర్ కామ్రేడ్’ హిందీ వర్షన్: 24 గంటల్లో రికార్డ్ వ్యూస్.. ఏం క్రేజ్ గురూ!

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యేవి. తెలుగులో స్టార్ హీరోలు తప్ప మిగిలిన నటుల గురించి ఇతర రాష్ట్రాల్లో తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు కాలం మారింది. డిజిటలైజేషన్ పుణ్యమా అని మన సినిమాలు దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. హిందీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నాయి. హిందీలో మన హీరోలు, సినిమాలకు ఉన్న క్రేజ్‌ చూసి తెలుగు సినిమాలను అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. వీటికి బోలెడంత క్రేజ్ ఉంది. 100 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకర్షించిన హీరో విజయ్ దేవరకొండ. ఈయనకి తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సౌత్‌లో ఈయనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. అయితే, ఈ సినిమాను తాజాగా హిందీలోకి అనువాదం చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. Also Read: గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద హక్కులను కొనుగోలు చేసింది. ఈనెల 19న తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాను విడుదల చేసింది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ చిత్రం 12 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇప్పటికైతే 16.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమాలోని కంటెంట్‌కు హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. యూట్యూబ్‌లో వీడియో కింద కామెంట్లు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. సినిమా తమ మనసుకు హత్తుకుందని, చాలా మంచి మూవీ అని కొనియాడుతున్నారు. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ పెద్దగా బిజినెస్ జరగలేదు. కానీ, హిందీ ప్రేక్షకులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తుంది. హిందీలో ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ చూస్తుంటే రేపు ‘ఫైటర్’ సినిమాను కూడా బాగా ఆదరించడం ఖాయంగా కనిపిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫైటర్’ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. హిందీలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36fCK7c

No comments:

Post a Comment

OpenAI promises to keep Stargate data center costs down - so your utility bills shouldn't go sky high...probably

OpenAI’s Stargate plan funds local energy infrastructure to prevent electricity bill spikes while supporting large-scale AI tools. from La...