Thursday, January 23, 2020

‘డిస్కోరాజా’ ట్విట్టర్ రివ్యూ: రవితేజ హిట్ ట్రాక్ ఎక్కినట్టే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉండేది. థియేటర్‌కు వెళ్తే మినిమం గ్యారంటీ ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని ప్రేక్షకులు ఫీలయ్యేవారు. నిజమే.. సినిమా అంతటినీ తన భుజస్కందాలపై మోయగల సత్తా ఉన్న నటుడు రవితేజ. కానీ, ఈ మధ్య ఆయనకు కాలం కలిసిరావడంలేదు. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ ట్రాక్ చూసుకుంటే హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లు రవితేజ స్టామినాను చెప్పాయి. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించారు. కానీ, ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలు ఆయన్ని ఒక్కసారిగా వెనక్కి లాగేశాయి. ఎవ్వరూ ఊహించిన రీతిలో ఈ మూడు సినిమాలు డిజాస్టర్లు అయిపోయాయి. అయినప్పటికీ నిర్మాతలకు మాస్ మహారాజాపై నమ్మకం పోలేదు. వరుసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న విభిన్నమైన చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ‘డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ కొత్త అవతారంలో అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించారని అంటున్నారు. సునీల్‌కు కూడా మంచి పాత్ర దక్కిందని కొంత మంది ట్వీట్లు చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కుమ్మేశారట. విలన్‌గా బాబీ సింహా అదరగొట్టారని అంటున్నారు. తమన్ మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట. మొత్తంగా సినిమా బాగుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాస్త నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. కొంతమంది రవితేజ మరోసారి నిరాశపరిచారని నిట్టూరుస్తున్నారు. స్టోరీ లైన్ వెరైటీగా ఉన్నా దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో సినిమాను రొటీన్‌గా మార్చేశారని అంటున్నారు. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ అనే ట్యాగ్ తగిలించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఓవరాల్‌గా రవితేజ హిట్టు కొట్టినట్టే కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడితే అసలు టాక్ బయటికి వచ్చేస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vdgbmN

No comments:

Post a Comment

50,000 WordPress site affected in major plugin security flaw - here's how to stay safe

A popular WordPress plugin has a worrying flaw which could allow website takeover. from Latest from TechRadar https://ift.tt/kfKO7nH