మహమ్మారి వైరస్ కరోనా అందరినీ ఇంట్లోనే కట్టిపడేసింది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పాటిస్తూ కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారంతా. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లోకి వచ్చి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇటు నెటిజన్స్‌కు, అటు సెలబ్రిటీలకు ఖాళీ సమయం దొరకడంతో నటీనటుల కెరీర్ తాలూకు చాలా విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా యాంకర్ ఆన్‌లైన్ చాట్ చేస్తూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది. బుల్లితెర యాంకర్‌గా, జబర్దస్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. వ్యాఖ్యాతగా చేస్తూ కూడా ఆడియన్స్ మనసు దోచుకోవచ్చు, అందాలతో ఆకట్టుకోవచ్చు అని నిరూపించిన యాంకర్ రష్మీ గౌతమ్. సరిగ్గా ఇవే క్వాలిటీస్ యాంకర్ లోనూ కనిపిస్తాయి. యాంకరింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ భేష్ అనిపించుకున్నారు ఈ ఇద్దరు జబర్దస్త్ బ్యూటీలు. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా హాట్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా జరిగిన ఆన్‌లైన్ చాట్‌లో యాంకర్ రష్మీకి ఓ కీలకమైన ప్రశ్న ఎదురైంది. 'ప్రస్తుతం మీరున్న ఫీల్డ్‌లో పోటీ ఎక్కువగా ఉంది కదండీ. ఆ పోటీని మీరెలా ఫేస్ చేస్తున్నారు?' అని అగగడంతో చాలా వివరంగా సమాధానమిచ్చి ఇలా కూడా ఆకట్టుకుంది రష్మీ గౌతమ్. పోటీ అనేది ఏ రంగంలోనైనా ఉంటుందని, కెరీర్‌లో ముందుకెళ్లడానికి అదే ప్రధానమని చెప్పింది. ''పోటీ ఉన్నప్పుడేగా ఎవరేంటో తెలిసేది. సుమగారి వంటి స్టార్ యాంకర్ల మధ్య అనసూయ, నేను ఈ రంగంలో ఎలా నిలదొక్కుకున్నామో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ మేము సుమగారితో పోటీ పడుతూనే ఉంటాము. కానీ ఒక్క విషయం.. నేను, అనసూయ బుల్లితెరకు గ్లామర్‌ను పరిచయం చేస్తూనే కొత్త ట్రెండ్ సృష్టించుకున్నాం. ఒకరకంగా మా సక్సెస్‌కి కారణం కూడా అదే. అలా చేయగలిగితే ఎవరైనా కూడా నిలబడగలుగుతారు'' అని రష్మీ తెలిపింది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ceMQcr
No comments:
Post a Comment