మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రేమ వ్యవహారం, ప్రణయ్ మర్డర్, .. ఈ అంశాలనే తన కథాంశంగా ఎంచుకొని 'మర్డర్' మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ . కిరాయి మూకలతో ప్రణయ్‌ని మర్డర్ చేయించిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోనే గాక యావత్ దేశంలో కలకలం సృష్టించి సంచలన హత్యగా చర్చల్లో నిలిచింది. ఈ క్రమంలో నిన్న (జూన్ 21) ఫాదర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే తమ రియల్ కథ ఆధారంగా వర్మ తీస్తున్న ఈ మూవీపై ఘాటుగా రియాక్ట్ అవుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది అమృత. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన 'మర్డర్' ఫస్ట్‌లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగిందని పేర్కొంది అమృత. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఒకేఒక్క కారణంగా సమాజంలో ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన చెందింది. Also Read: ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చిందని, అయితే.. దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని చెప్పింది అమృత. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని, కనీసం ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని ఆమె అంటోంది. తన సినిమా కోసం వర్మ లాంటి ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని అస్సలు ఊహించలేదని తెలిపింది. సాటి మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలిగా ఉందని అమృత వాపోయింది. ఈ స్వార్థపూరిత సమాజంలో వర్మ కూడా ఒకరని తేలిపోయింది కాబట్టి.. ఆయనపై ఎలాంటి కేసు కూడా పెట్టదలచుకోలేదని చెప్పింది. మొత్తానికి మరోసారి సంచలనంగా మారిన అమృత- మారుతీరావు స్టోరీని వర్మ చివరిదాకా కొనసాగించి ప్రేక్షకుల ముందుంచుతారో.. లేదో చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3enRvtx
No comments:
Post a Comment