నందమూరి బాలకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవన్నారు మెగా బ్రదర్ . ఆయన ఆవేశం పడ్డారు కాబట్టే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని.. వాస్తవానికి ఆయనంటే గౌరవం అంటూ బాలయ్యతో వివాదానికి ముగింపు పలికారు నాగబాబు. ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బాలయ్యపై ఫైర్ కావడానికి నేనెవర్నండీ.. ఒకరిపై ఫైర్ అయ్యేటంత గొప్పేడిని కాదు నేను. ఈ ఇష్యూలో నా ఒపీనియన్ చెప్పా అంతే. చాలా విషయాల్లో అన్నయ్యను, కళ్యాణ్ బాబుని విమర్శించినప్పుడు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక్కడ కూడా నేను పాపం గారిని టార్గెట్ చేయాలని కాదు.. మొదటగా బాలకృష్ణ గారు ఆవేశపడ్డారు. అది కరెక్ట్ కాదని నా వేలో చెప్పాను తప్ప.. నాకు బాలకృష్ణ గారితో శతృత్వం లేదు. నిజానికి నేను బాలకృష్ణ గారితో ఏ విషయంలోనూ సమానం కాదు. నేను చిరంజీవి బ్రదర్‌నే తప్ప బాలకృష్ణ మాదిరి హీరోని కాదు. నేనో నిర్మాతని. బాలకృష్ణ హీరో. ఆయనతో సమానం అని చెప్పుకునే కెపాసిటీ నాకు లేదు. ఆయనతో సమానంగా ఉండే వ్యక్తిని కాదు నేను. బాలకృష్ణ గారితో నాకు ఎటువంటి శతృత్వం లేదు.. బాలకృష్ణ గారితో నాకు విభేదాలు లేవు. హలో అంటే హలో తప్ప.. ఆయనతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. కాని ఆరోజు ఆయన అలా మాట్లాడిన దానికి అది కరెక్ట్ కాదని చెప్పాను. పాపం ఆయన కూడా రియలైజ్ అయ్యారు. ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నా. గౌరవం ఇవ్వకుండా ఉండటం లేదు. ఆయనే కాదు ఎవరైనా అలా మాట్లాడితే ఖండించే వాడిని. ఇండస్ట్రీలో గొడవ వచ్చిన ప్రతిసారీ.. మీడియా దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత బిల్డప్ ఇస్తారు. ఇండస్ట్రీలో మిగతా రంగాలతో పోల్చుకుంటే గొడవలు చాలా తక్కువ. ‘మా’ గొడవలు అన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి’ అంటూ వివాదానికి ముగింపు పలికారు మెగా బ్రదర్ నాగబాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ybl4aX
No comments:
Post a Comment