కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్దిరోజుల పాటు ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. సినిమాలు కూడా పక్కన పెట్టేసి ప్రియుడితో ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె ప్రేమ సంగతులే కనిపించాయి. ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఆమె.. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైందనే వార్తలు వచ్చాయి. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఉహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి కెమెరా ముందుకొచ్చింది శృతి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత మూడేళ్ళుగా తనను మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చింది . వ్యక్తిగత కారణాలతోనే ఇటీవలి కాలంలో నటనకు దూరంగా ఉన్నానని, ఇప్పుడిప్పుడే ఆ మానసిక సమస్యల నుంచి తేరుకుంటున్నానని ఆమె చెప్పింది. విషయం ఏదైనా మనసులో దాచుకోకుండా కుండబద్దలు కొట్టే ఈ ముద్దుగుమ్మ.. ఈ మాట చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రియుడితో బ్రేకప్, అతనితో ప్రేమాయణం, ఆ పొరపాట్ల గురించే ఆమె ఇలా చెప్పి ఉంటుందని చర్చించుకుంటున్నారు. Also Read: కాగా తన సమస్యలకు చికిత్స కూడా పొందుతున్నానని చెప్పిన శృతి.. తనకు మానసిక సమస్యలున్నాయని చెప్పడానికి ఏ మాత్రమూ బాధపడటం లేదని, ధ్యానం, యోగా, వ్యాయామం, బుక్ రీడింగ్, సంగీతం వినడం లాంటి క్రమంతప్పకుండా చేస్తూ కాస్త ఉపశమనం పొందుతున్నానని తెలిపింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటం దేశాన్ని కకావికలం చేసేసిందని, ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితని అభిప్రాయపడింది శృతి హాసన్. ఇకపోతే తెలుగులో శృతిహాసన్ తాజా సినిమా 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించినట్లు టాక్. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బి. మధు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A9nezS
No comments:
Post a Comment