Sunday, June 21, 2020

హన్సికకు సూపర్ ఆఫర్.. వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయిన హాట్ బ్యూటీ

టెక్నాలజీ విస్తరిస్తుండటం, కరోనా లాంటి అంటూ రోగాలు ప్రభలుతుండటం.. ప్రజలను డిజిటల్ రంగం వైపు మళ్లిస్తోంది. దేశంలో కరోనా ఎంటరయ్యాక థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులేస్తూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హాట్ బ్యూటీ కూడా తనకు వచ్చిన సూపర్ ఆఫర్ అగ్రీ చేసి ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయిందట. ఈ మధ్యకాలంలో తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వేడిపుట్టిస్తున్న హన్సికకు.. డిజిటల్ మీడియాలో సత్తా చాట్ ఛాన్స్ వచ్చేసిందని సమాచారం. Also Read: 'భాగమతి' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్‌లో హన్సిక నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట. కథ నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ చేసేందుకు హన్సిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నేటి యువతకు కావాల్సిన హాట్ నెస్ జోడిస్తూ మహిళా సమస్యలను తనదైన స్టైల్‌లో చూపించనున్నారట అశోక్. అతిత్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు రానుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NjXC6w

No comments:

Post a Comment

50,000 WordPress site affected in major plugin security flaw - here's how to stay safe

A popular WordPress plugin has a worrying flaw which could allow website takeover. from Latest from TechRadar https://ift.tt/kfKO7nH