ఓ వైపు కరోనా మరణాలు.. మరోవైపు కరోనా కారణంగా మరణాలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుస్థితి ఇది. కరోనా మహమ్మారి దాటికి దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఊహించని ఈ విపత్తు అశేష ప్రజానీకాన్ని ఆర్ధికంగా, మానసికంగా వెన్నువిరిచింది. ఈ కల్లోల పరిస్థితుల్లో కొందరు కరోనా సోకి మరణిస్తుండగా, ఇంకొందరు కరోనా తెచ్చిపెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తున్నాం. కరోనా నివారణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా, సీరియల్ షూటింగ్స్ అన్నీ రద్దయ్యాయి. దీంతో సినీ కార్మికులు, చిన్న నటీనటుల ఆర్ధిక పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. చేసేది లేక కొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలవరపెడుతోంది. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఓ ఉదంతమే వెలుగు చూసింది. తమిళ టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు శ్రీధర్, అతడి సోదరి జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నైలోని కొడంగయ్యూర్‌లో వారు నివసిస్తున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల ప్రవేశంతో ఆ ఇంట్లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. అవి కుళ్ళిన దశలో ఉన్నాయి. వెంటనే ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించగా, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f41hRL
No comments:
Post a Comment