Tuesday, June 9, 2020

Happy Birthday Balakrishna: ఎన్టీఆర్ వారసత్వాన్ని తొడకొట్టి నిలబెట్టడం బాలయ్యకు ఈజీనా?

తెలుగు తెరపై తిరుగులేని నటసార్వభౌముడుగా.. తెలుగు రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లఖించిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు. ఈయన వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒకే నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే.. ఒకే ఎన్టీఆర్‌లో రెండు రకాల జీవిత కోణాలు ఉన్నాయి. అటు సినిమా.. ఇటు రాజకీయం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అన్నగారి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేటితో (జూన్ 10) అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయాల్లో కీలక ఘట్టాలపై ఓ లుక్కేద్దాం. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సామన్యమైన విషయమే. అయితే బాలకృష్ణ విషయంలో ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే నట శిఖరం. ఆ శిఖరంతో సమానంగా కాకపోయినా కనీసం ఆ స్థాయిలో మెప్పించకపోతే ప్రేక్షకులు నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాని బాలయ్య చిన్నప్పటి నుంచి నరనరాల్లో నటనను జీర్ణింపజేసుకుని 14 ఏళ్లకే ‘తాతమ్మ కల’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కొంతకాలం పాటు తండ్రిచాటు బిడ్డగానే సినిమాలు చేసి.. ‘మంగమ్మగారి మనువడు’ చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు బాలయ్య. ఆ సినిమా తరువాత.. సీతారామ కళ్యాణం, ముద్దుల మావయ్య లాంటి చిత్రాలతో నటవారసుడు అనే మాటకు న్యాయం చేసి.. 90లో వచ్చిన నారీ నారీ నడుమ మురారి చిత్రంతో విశ్వరూపం చూపారు. అనంతరం లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్‌స్టెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద గర్జించి నందమూరి నటసింహంగా మారారు. ఇవే కాకుండా ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో తనకోసమే పుట్టాయా ఈ పాత్రలు అన్నట్టుగా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఫ్యాక్షన్ చిత్రాల్లో బాలయ్య మార్క్ చూపిస్తూ.. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సీమసింహం, లక్ష్మీనరసింహ వంటి చిత్రాలతో తొడ కొట్టి మరీ బాక్సాఫీస్‌ని శాసించారు. ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ అంటూ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు బాలయ్య. ఆ తరువాతి పదేళ్లలో ఆయన ట్రాక్ రికార్డ్ కాస్త గతి తప్పినా.. సింహా, లెజెండ్, జై సింహా శాతకర్ణి వంటి చిత్రాలతో సత్తా చాటారు. ఎన్టీఆర్ బయోపిక్: ఒక కొడుకు తండ్రి సినీ జీవితాన్ని సినిమాగా నిర్మించడం.. కొడుకే తండ్రి పాత్రను పోషించడం సినీ హిస్టరీలో ఇదే తొలిసారి. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలతో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు బాలయ్య. ఈ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే తెలుగు ప్రజలు యుగపురుషుడిగా భావించే ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా మలిచాలన్న బాలయ్య ప్రయత్నం ఆహ్వానించదగ్గదే. 1974 నుంచి ఇప్పటి వరకూ 105 సినిమాలు తీసిన బాలయ్య తాజాగా తన లక్కీ డైరెక్టర్ బోయపాటితో మరో యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. నాటి సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు పాత్రల్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు బాలయ్య. తన వయసు 60 అయినా.. మరో 60 ముందున్నాయి అంటున్నాయి.. నా వయసు 60 కాదు ఆరేళ్లే అంటున్నారు బాలయ్య. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బాలయ్యను ఆ ముక్కుసూటి తనమే వివాదాల్లోకి లాగుతూ ఉంటుంది. ముఖానికి రంగు వేసుకున్న తరువాత ఒకలా.. తీసేసిన తరువాత ఒకలా ఉండటం తన వల్ల కాదని చెడు అయినా మంచి అయినా ఫేస్ టు ఫేస్.. మర్యాద ఇవ్వండి ఇచ్చుకోండి.. తేడాలొస్తే మాత్రం సహించేదని లేదని కుండబద్దలు కొట్టేస్తుంటారు బాలయ్య. ఎవరు ఏమి అనుకున్నా.. ఈ ప్రపంచంలో నాకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకొకరు ఉండరని చెప్పే బాలయ్య తనను తాను నమ్ముకుని తనకు నచ్చినట్టుగానే ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. తరచూ ఆయన్ని వివాదాలు వెంటాడుతున్నా.. పనికట్టుకుని ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నా వెనక్కితగ్గే ప్రసక్తే లేదంటున్నారు నందమూరి నటసింహం. సినిమాల్లో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుని తొడకొట్టి మరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన బాలయ్య.. రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే బాలయ్యా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30r6UoJ

No comments:

Post a Comment

Is AI adoption at work flatlining? This major survey thinks so - but it's definitely not the end just yet

The number of people using AI might be flatlining, but it looks like we'll see more uses cases develop next. from Latest from TechRada...