సినీ ఇండస్ట్రీలో (నెపోటిజం) ఉందని ఇప్పటికే ఎందరో హీరోహీరోయిన్స్ బాహాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నెపోటిజం అనేది బాలీవుడ్‌ని పట్టిపీడిస్తోందని పలువురు నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యంగ్ హీరో ఆత్మహత్య తర్వాత ఈ అంశం నిత్యం చర్చల్లో నిలుస్తోంది. బాలీవుడ్ చీకటి కోణాలు అన్నీ ఇన్నీ కావంటూ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు నటీనటులు. తాజాగా సుశాంత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి నెపోటిజం, ఇండస్ట్రీ చీకటి కోణాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రిచా చద్దా తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. బాలీవుడ్‌లో రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారని.. అది ఒకటి జాలి ఉన్నవారు.. రెండు జాలి లేనివారు అని పేర్కొంది. స్టార్ కిడ్స్‌లో మంచివాళ్ళు కొందరున్నారని, అయితే కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో పాతుకుపోయి జాలిలేని కొందరు మాత్రం హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ మరణం తర్వాత నీతి వాక్యాలు చెబుతూ, ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన దర్శక నిర్మాతల్లో కొందరు నీచమైన వ్యక్తులున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు దర్శకనిర్మాతల్లో.. ఆఫర్ ఇచ్చాక కూడా హీరోయిన్లు తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన వాళ్ళు చాలామంది ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. దీంతో ఇండస్ట్రీలో నెపోటిజం, లైగిక వేధింపుల అంశాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. Also Read: ఇకపోతే సుశాంత్‌తో తన జ్ఞాపకాలను పంచుకున్న రిచా.. కెరీర్ ఆరంభానికి ముందు ఇద్దరం కలిసి ముంబైలో థియేటర్ వర్క్‌షాప్స్‌కి వెళ్లేవాళ్లమని తెలిపింది. రిహార్సల్స్ చేయడానికి వెళ్లే ఆ సమయంలో సుశాంత్ తనను బండిమీద తీసుకెళ్లేవాడని, ఇండస్ట్రీ ఓ టాలెంటెడ్ యాక్టర్ ని కోల్పోయిందని పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Cq6HIY
No comments:
Post a Comment