యంగ్ హీరో రానా ఇటీవలే తన పెళ్లి విషయాన్ని చెప్పి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ లభించిందని పేర్కొంటూ ప్రేయసి మిహికా బజాజ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దగ్గుబాటి రానా. ఈ క్రమంలో ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్షన్ జరుపుకున్న ఆయన.. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్ల పనిలో ఉన్నారు. వచ్చే నెల 8వ తేదీన రానా- మిహీకా వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక జరుగనుంది. ఈ పెళ్లి వేడుకను అత్యంత గ్రాండ్‌గా ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు. కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారట. కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: కాగా తన పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , వైఎస్ జగన్‌లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించనున్నారట రానా. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి ఆయనే స్వయంగా ఆహ్వాన పత్రికలను అందించి తన పెళ్ళికి రావాల్సిందిగా కోరనున్నారని తెలిసింది. ఇటీవలే మరో హీరో నితిన్ కూడా తన పెళ్లి ఆహ్వాన పత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అందజేసిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jsggYJ
No comments:
Post a Comment