Saturday, July 25, 2020

Rang De: నితిన్ మ్యారేజ్ సందర్బంగా స్పెషల్ గిఫ్ట్! ‘రంగ్ దే’ యూనిట్ భలే ప్లాన్ చేసిందే..

ఈ రోజే (జులై 26) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రియురాలు కందుకూరి షాలిని మెడలో మూడు ముళ్ళేయడానికి సిద్ధమయ్యారు హీరో నితిన్. నేటి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తాజ్ ఫలక్ నుమా హోటల్ వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతోంది. కరోనా కారణంగా కేవలం అతికొద్దిమంది సన్నిహితుల మధ్యనే ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే మెహందీ ఫంక్షన్ పూర్తికావడంతో నితిన్- షాలిని జోడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నితిన్ పెళ్లి అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో నితిన్ - షాలినిల వివాహం సందర్భంగా '' టీమ్ ప్రత్యేకంగా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ కావడం విశేషం. జూలై 26న 4 గంటల 05 నిమిషాలకు నితిన్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించి అభిమానుల్లో ఆతృతను పెంచేసింది చిత్రయూనిట్. ఓ వైపు తమ అభిమాన హీరో పెళ్లి పీటలెక్కుతున్నారనే సంబరం, మరోవైపు ఆయన లేటెస్ట్ మూవీ నుంచి సర్‌ప్రైజ్ రానుందనే న్యూస్ నితిన్ ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తోంది. కాగా 'రంగ్ దే' నుంచి రాబోతున్న ఆ గిఫ్ట్ ఏంటనేది ఏ మాత్రం హింట్ ఇవ్వకుండా సస్పెన్సులో పెట్టేసింది చిత్రయూనిట్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. 'గివ్ మీ స‌మ్ ల‌వ్‌' అనేది ఉప‌శీర్షిక‌. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WSJVAs

No comments:

Post a Comment

A laser that can fire light pulses in one billionth of a second is set to produce structures 1000 times stronger, 1000 times faster — novel technique has applications for high-performance computing, quantum devices, and AI chip cooling

Researchers demonstrate a laser-based method that alters heat flow in thin silicon films using scalable nanoscale surface patterning techniq...