ప్రతి ఏడాది బుల్లితెరపై హంగామా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా ఫినిష్ చేసుకొని నాలుగో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ప్రోమో రిలీజ్ కావడంతో జనాల్లో ఆసక్తి మొదలైంది. ఈ వీడియో చూశాక.. కరోనా ప్రభావంతో ఈ షో జరుగుతుందా? లేదా? అనే అనుమానం అందరి నుంచి తొలగిపోయింది. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? హోస్ట్ ఎవరు? కంటిస్టెంట్స్ ఎవరెవరు ఉండనున్నారు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మిగిలింది. Also Read: కాగా బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్, కంటిస్టెంట్స్ విషయమై యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఓ 15 మంది సెలబ్రిటీల లిస్టుతో పాటు మరోసారి హోస్ట్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించింది యాంకర్, బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ . తాజాగా కాసేపు అభిమానులతో లైవ్ చాట్‌లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ''బిగ్ బాస్ సీజన్ 4కి కూడా నాగార్జున గారే హోస్ట్ అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్నాయి కదా!. అవును నేను కూడా బలంగా నమ్ముతున్నా.. సీజన్ 4 హోస్ట్ నాగార్జున గారే'' అని శ్రీముఖి తెలిపింది. ఆమె చెప్పిన ఈ మాటతో నాగార్జుననే హోస్ట్ అని ఫిక్సయ్యారంతా. ఇకపోతే 'సక్కగ పెళ్లి చేసుకో' అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై స్పందించిన శ్రీముఖి.. అబ్బా! పెళ్లి చేసుకుంటే రోజులు మంచిగై కరోనా పోతదా. ఏం తెలుసు తమ్ముడు నీకు.. సగం జీవితం కూడ బ్రతకరు కానీ పెళ్లి చేసుకో అని చెబుతున్నరు'' అంటూ వెక్కిరించేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30GkFhM
No comments:
Post a Comment