నటుడు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ సతీమణి మధుమిత పుట్టినరోజు వేడుకను ఫామ్ హౌస్‌లో జరుపుకున్నారు. ఎప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకునే మధుమిత.. ఈసారి కరోనా వైరస్ కారణంగా తమ ఫామ్ హౌస్‌లో వర్కర్స్ మధ్య జరుపుకున్నారు. శివబాలాజీ, మధుమిత కలిసి వర్కర్స్‌కు స్వయంగా వండి వడ్డించారు. ఈ సందర్భంగా నిప్పులపై కాల్చే చికెన్ వంటకాన్ని వండి వర్కర్స్‌కు రుచి చూపించారు. ఈ వీడియోను తాజాగా విడుదల చేశారు. కాగా, ఈ లాక్‌డౌన్ టైమ్‌లో మధుమిత తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వంటల వీడియోస్ పోస్ట్ చేశారు. చాలా మంది అభిమానులు ఆమెను యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. దీంతో శివబాలాజీ దంపతులు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ కరోనా టైమ్‌లో వంటల ప్రోగ్రామ్‌తో మరింతమందికి చేరువయ్యారు. రకరకాల వంటకాలతో మధుమిత ఆకట్టుకున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ప్రసవం తరువాత మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మధుమిత చేసిన వీడియోలకు వ్యూవర్స్ ఎమోషనల్‌గా అటాచ్ అయ్యారు. ఇలాంటి ఒక టాపిక్ మీద ఇంత వివరంగా వీడియో చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో తమకు ఎంతో ఉపయోగ పడుతుందని చాలామంది మహిళలు అన్నారు. ఈ వీడియో చేయడానికి సపోర్ట్‌గా నిలిచిన శివబాలాజీకి కూడా ధన్యవాదాలు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32hc9qq
No comments:
Post a Comment