గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ కరోనాతో పోరాడుతున్నారు. కరోనా వైరస్ సోకడంతో ఆయన ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ, ఆగస్టు 13వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయనకు వెంటిలేటర్‌ను తొలగించి ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలుస్తుండటంతో సినీ లోకం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అశేష సినీ వర్గాలు ప్రార్థనలు చేస్తున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, సంగీత లోకానికి చెందిన ప్రముఖులు బాలు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ''తొందరగా కోలుకుని రా.. నువ్వు పాడితే వినాలని ఉంది'' అంటూ భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు దర్శకేంద్రుడు . Also Read: ''బాలూ... నాకు మాటలు రావట్లేదు.. నువ్వు పాడితే వినాలనుంది.. నాతో పాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము. నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా'' అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకొని అందరినీ అలరించాలని కోరుకుంటున్నారు. కాగా.. నిన్న బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై భావోద్వేగానికి గురవుతూ మాట్లాడటం అశేష ప్రేక్షకలోకాన్ని కలవరపెట్టింది. ‘‘మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అంటూ వణుకుతున్న గొంతుతో చరణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l0WLqO
No comments:
Post a Comment