తెలుగు, తమిళ సినిమాల్లో పేరొందిన కథానాయిక సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగిన ఈ అమ్మడు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవనుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' సినిమాలో పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'రొమాంటిక్' మూవీలో ఆకాష్ పూరి సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. తన శిష్యుడు అనిల్ పాదూరిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందని తెలిసింది. అయితే ఆమెతో పాటు మరో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటిస్తోందని, అది కూడా పవర్ ఫుల్ అత్త పాత్రలో అని తెలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. సిమ్రాన్ రోల్‌తో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని పూరి ఈ విషయాన్ని దాచి పెట్టారట. Also Read: మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు సిమ్రాన్ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఆకాష్ పూరి అత్తగా ఆమె అదరగొట్టేయనుందట. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. కొడుకును ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్న పూరి.. ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ బాగా దట్టించారని, కథాకథనాలతో పాటు రొమాంటిక్ సీక్వెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ghYDYI
No comments:
Post a Comment