Tuesday, September 29, 2020

విజయ్‌తో సినిమా.. భారీ మొత్తంలో సుకుమార్‌కు అడ్వాన్స్ రెమ్యునరేషన్!

క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సెన్సేషనల్ హీరో రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ ఆసక్తికర చిత్రం ద్వారా కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్‌తో కలిసి పనిచేయడం కోసం ఆత్రతగా ఎదురుచూస్తున్నానని విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఆఖరిలో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమా కోసం సుకుమార్‌కు అప్పుడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్‌కు కేదార్ సెలగంశెట్టి రూ.10 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించారట. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా లాభాల్లో సుకుమార్‌కు కూడా షేర్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత విజయ్ దేవరకొండతో పూరి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ పడింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jgvlfk

No comments:

Post a Comment

Save a massive $400 on the powerful and four-star-rated Dell 16 Plus laptop at Best Buy

The Dell 16 plummets back to the record-low price we saw it drop to last year in the Best Buy Winter Sale. from Latest from TechRadar http...