డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిల్ రాజు తక్కువ కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో ‘తొలిప్రేమ’ను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయనతో పవర్‌స్టార్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. 20ఏళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’తో ఆయన కోరిక నెరవేరింది. పవన్‌తో తీసిన సినిమా నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లు ఆఫర్ చేసినా వదులుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని భావిస్తున్న దిల్‌రాజు దీనిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. దీనికి తోడు దసరా నుంచి కొత్త పోస్టర్స్ వదిలి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని పవన్ కూడా ఆయనకి సూచించారట. దీంతో పోస్టర్లతో పాటు లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ సూపర్ హిట్ చిత్రాలైన ‘తొలిప్రేమ’ ‘ఖుషి’ ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల రికార్డులను తిరగరాసేలా ‘’ ఉండాలని దిల్ రాజు భావిస్తున్నారట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kbGcHW
No comments:
Post a Comment