Sunday, October 25, 2020

Akhil Akkineni: కాబోయే భార్యతో అఖిల్ తంటాలు.. పాపం! అక్కినేని వారసుడికి చుక్కలు చూపించిన బ్యూటీ

పండగ పూట అక్కినేని వారబ్బాయి అఖిల్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి తాను పడుతున్న తిప్పలు కళ్ళముందుచాడు. 'మీ వైవాహిక జీవితం నుండి మీరేం ఆశిస్తున్నారు' అని తనకు కాబోయే అమ్మాయిని ప్రశ్నిస్తూ ఆమె చెప్పే సమాధానాలు విని బిత్తరపోతున్నాడు. తాజాగా ఈ ఆసక్తికర వీడియోను టీజర్ రూపంలో రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది టీమ్. హీరోగా రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా నుంచి దసరా కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ఆమె అఖిల్‌కి చుక్కలు చూపించే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హస్బెండ్ అంటే అన్ని పనులు షేర్‌ చేసుకోవాలి, నాకు జాయింట్‌ ఫ్యామలీ అంటే చిరాకు అంటూ తనకు కాబోయే భార్య పెట్టే కండీషన్స్ విని అఖిల్ షాకవుతుండటం ఈ వీడియోలో ఆసక్తికర అంశం. Also Read: పైగా 'నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం' అని ఆ అమ్మాయి చెప్పడంతో అఖిల్ పరేషాన్ అయ్యాడు. మరి ఇలాంటి అమ్మాయితో ఈ అక్కినేని వారబ్బాయి ఎలా వేగాడు? ఇంతకీ వారిద్దరి పెళ్లి జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ నిర్మిస్తున్న ఈ 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37G3fam

No comments:

Post a Comment

'Apple went in, Nvidia went in, a lot of smart people went in': Did Apple join Nvidia in investing in Intel? Trump seems to suggest so - or was it just a slip of the tongue?

President Trump implies Apple may have joined Nvidia in investing in Intel. from Latest from TechRadar https://ift.tt/GU1B6A8