దక్షిణాది నటి వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లోకెక్కింది. దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో జూన్ నెలలో సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని షాకిచ్చింది వనిత. పీటర్ తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి అని, అతడితో భవిష్యత్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడంటూ అతడి మొదటి భార్య కేసు పెట్టడంతో వివాదం మొదలైంది. Also Read: వనితా విజయ్‌కుమార్‌పై సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరో మహిళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. వాటన్నింటికీ గట్టిగా కౌంటర్ ఇచ్చిన వనిత న్యాయపరంగా తాను చూసుకుంటానని చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి మూడు నెలలకే పెటాకులైనట్లు తెలుస్తోంది. వనిత తన మూడో భర్తను తన్ని ఇంట్లో నుంచి తరిమేసినట్లు వెలుగులోకి వచ్చింది. Also Read: ఇక ఇటీవల వనితా, పీటర్‌లు పిల్లలను తీసుకొని గోవా ట్రిప్‌కి వెళ్లి వచ్చారు. అక్కడ వీరిద్దరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గోవా ట్రిప్‌లో ఫుల్లుగా మద్యం సేవించిన పీటర్ .. వనితతో అసభ్యంగా ప్రవర్తించాడట. దీంతో ఆమె ఆవేశానికి గురైన భర్తను కొట్టిందట. చెన్నై వచ్చిన తర్వాత కూడా పీటర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వనిత అతడిని తన్ని ఇంట్లో నుంచి గెంటేసినట్లు కోడై కూస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అక్రమ వివాహానికి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్)ని ఆమె తన్ని తరిమేసింది’ అని కామెంట్ పెట్టారు. వనిత మూడో వివాహంపై రవీందర్ తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కారు. భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని అక్రమంగా పెళ్లి చేసుకోవడం తప్పని అన్నారు. ఆయన కామెంట్లపై వనిత కూడా గట్టిగానే స్పందించారు. తన జీవితం గురించి మాట్లాడేవారెవ్వరూ తనకు సాయం చేయరని, ఉన్నపళంగా రూ.40 వేలు అవసరముందని అడిగితే ఎవ్వరూ ఇవ్వరని కౌంటర్ వేసింది. మూడో భర్తతో విభేదాల గురించి వనిత ఏం చెబుతుందో వేచి చూడాలి మరి. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2INQ0Kn
No comments:
Post a Comment