అనతి కాలంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండ.. తాజాగా దేశంలో రాజకీయ విధానాలు, లాంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం సాధారణమైన విషయంగా మారిందని, ఈ సమాజంలో కొందరికి ఓటు హక్కు తొలగించాలంటూ సంచలనం సృష్టించారు. దీంతో మాటలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రదుమారం రేపుతున్నాయి. తనకు రాజకీయాలు చేసేంత ఓపిక లేదని చెప్పిన ఈ రౌడీ స్టార్.. మన దేశంలో రాజకీయ వ్యవస్థ అంతా అర్థంపర్థం లేకుండా ఉందంటూ తన అభిప్రాయాలను బయటపెట్టారు. ఓ వైపు ఓటర్లు డబ్బుకు, లిక్కర్‌కు అమ్ముడుపోవడం మరోవైపు రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం అన్నీ సర్వసాధారణం అయ్యాయని అన్నారు. ఇలా లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదంటూ ఎన్నికల సమయంలో ఏరులై పారుతున్న నగదు ప్రవాహంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని విజయ్ దేవరకొండ అన్నారు. Also Read: డబ్బు కోసం ఓటు అమ్ముకునే వారికి ఓటుకు ఉన్న విలువ తెలియదని, అలాంటి వారికి ఓటు హక్కును తొలగించడమే సరైన చర్య అని విజయ్ తెలిపారు. అలాగే పేద వాళ్లకు, బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు ఉండకూడదని.. కేవలం మధ్యతరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండటం మేలు అని, ఓటు విలువ మధ్యతరగతి వాళ్లకు మాత్రమే తెలుసని ఆయన పేర్కొనడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఓ ఉదాహరణ కూడా చెప్పిన విజయ్ దేవరకొండ.. ''ఓ విమానం నడిపే పైలట్‌ని అందులో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను కూడా సమాజంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి'' అని అన్నారు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ చూసి ఆయనకు సబ్జెక్ట్‌పై అవగాహన లేదని అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా 'ఫైటర్' మూవీ చేస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FikxhW
No comments:
Post a Comment