ఉత్తరాదికి చెందిన 2012లో ‘అందాలరాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. పెద్ద స్టార్ల సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా దాదాపు యంగ్ హీరోలు అందరితోనూ ఆమె నటించింది. ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరగడంతో ఆమె చూపు అటువైపు మళ్లినట్లు తెలుస్తోంది. లావణ్య ఈ ఏడాది ఓటీటీలోకి ఆరంగ్రేటం చేస్తున్నట్లు సమాచారం. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రాధాన్యాన్ని గుర్తించిన రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్ వంటి తారలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గుచూపారు. Also Read: దీంతో ఇప్పుడు ఆ జాబితాలో లావణ్య త్రిపాఠి చేరనున్నారు. ఆమె కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా దర్శకుడు మారుతితో కలిసి పనిచేయనున్నారు. దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు తెలిసిది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావనతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుందని, ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. లావణ్య ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Btuuk
No comments:
Post a Comment