అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న చిత్ర యూనిట్ డిసెంబర్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించాలనుకుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను సడలించడంతో పాటు, కూడా ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో పాల్గొందామా అని ఉత్సాహంగా ఉండటంతో ప్లాన్‌లో మార్పులు చేశారు. ముందుగా అనుకున్నట్లుగా డిసెంబర్‌లో కాకుండా నవంబర్‌లోనే షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. Also Read: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగా ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ సినిమాలో చాలా భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు. దీంతో యూనిట్ నవంబర్‌లో కేరళకు పయనం కానుంది. రాక్‌స్టార్ దేవీవ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3llNHMs
No comments:
Post a Comment