టాలీవుడ్‌లో త్రివిక్రమ్-మహేష్‌బాబు కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఉండే క్రేజే వేరు. వారిద్దరు కలిసి చేసింది రెండే సినిమాలైనా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. అతడు, ఖలేజా.. మహేష్ కెరీర్లోనే మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. అయితే - త్రివిక్రమ్ కలిసి మరో చిత్రం చేయబోతున్నారంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ చేసిన ట్వీట్ అదే సంకేతాల్నే ఇస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు-అనుష్క జంటగా నటించిన ‘ఖలేజా’ బుధవారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ ఓ వీడియోని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నటుడిగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకున్న చిత్రమిది అంటూ ట్వీట్ చేశారు. ‘‘నా కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా ‘ఖలేజా’. నాకు మంచి ఫ్రెండ్, అద్భుతమైన త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు. మన తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నా. అతి త్వరలోనే’’ అంటూ మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read: ‘అతడు’ చిత్రంతో మహేష్ - త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేశారు. వీరి కలయికలో మూడో చిత్రం గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కార్ వారి పాట’ కోసం సన్నద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ వస్తే మహేష్ ఫ్యాన్స్‌కి పండగే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36LqRd8
No comments:
Post a Comment