Tuesday, October 6, 2020

థియేటర్లలో బొమ్మ పడాలంటే ఇలా చేయాల్సిందే.. కేంద్రం మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌‌ కారణంగా ఏడు నెలలుగా పైగా మూతపడిన సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి , తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. అయితే గతంలో మాదిరిగా ఇష్టం వచ్చిన థియేటర్లను నిర్వహించడానికి కుదరదు. థియేటర్లు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలో చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ మంగళవారం మీడియా ద్వారా వెల్లడించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సూచించిన నియమాలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాలివే.. * సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో 50శాతం మంది ప్రేక్షకులకు అనుమతి. * ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయించేందుకు ప్రాధాన్యం. * సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యకు తగినట్లుగా కౌంటర్లు అందుబాటులోకి తేవాలి. * థియేటర్‌కు వచ్చిన వారు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ నడుచుకోవాలి. * టికెట్లు రోజంతా విక్రయించాలి. రద్దీని తగ్గించడానికి ముందస్తు బుకింగ్‌లకు అనుమతివ్వాలి. * భౌతిక దూరం కోసం టికెట్‌ కౌంటర్లు, థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌ల వద్ద నేలపై మార్కింగ్ చేయాలి. * థియేటర్లోకి ప్రవేశించే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. ఎలాంటి లక్షణాలు లేవని ధ్రువీకరించుకున్నాకే లోనికి పంపాలి. * ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వాడాలి. * థియేటర్‌ ప్రాంగణంలో హ్యాండ్‌ వాష్‌, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. * మల్టీప్లెక్స్‌లలో వివిధ స్క్రీన్‌ల ప్రదర్శనల మధ్య తగిన వ్యవధి ఉండాలి. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులంతా ఒకే సమయంలో బయటకు రాకుండా ప్రణాళికలు రూపొందించాలి. * థియేటర్లో ఏసీ టెంపరేచర్ 24 -30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉండాలి. వెంటిలేషన్‌ మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. * ప్యాక్‌ చేసిన ఆహారం, పానియాలను మాత్రమే అనుమతించాలి. థియేటర్లో అన్ని కౌంటర్ల వద్ద సాధ్యమైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. * థియేటర్‌ స్క్రీన్‌ లోపల ఆహారాన్ని డెలివరీ చేయడం నిషేధం. * సినిమా హాల్లో ప్రేక్షకులు పాటించాల్సిన అన్ని జాగ్రత్తల గురించి స్క్రీనింగ్‌కు ముందు, తర్వాత ప్రకటనలు వేయాలి. * షో ముగిశాక. మరొక షో ప్రదర్శించే ముందు అన్ని సీట్లను తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయాలి. * థియేటర్‌ ప్రాంగణాన్ని రోజూ క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేయాలి. * థియేటర్ల సిబ్బంది పీపీఈలు, హ్యాండ్ గ్లౌజులు, బూట్లు, మాస్క్‌లు ఉపయోగించాలి. * ఏ ప్రదేశంలోనూ ఉమ్మివేయడం నిషేధం. * విశ్రాంతి సమయంలో ప్రేక్షకులు అటూ ఇటూ కదలకుండా సీట్లలోనే ఉండేలా ప్రోత్సహించాలి. * థియేటర్ల లోపల, బయట క్రమం తప్పకుండా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి. * పార్కింగ్‌, మిగతా స్థలాల్లో జనం గుమికూడకుండా తగు చర్యలు తీసుకోవాలి. * ప్రేక్షకులందరి కాంటాక్ట్‌ నెంబర్లు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం దాన్ని ఉపయోగించాలి. * థియేటర్లలో ప్రేక్షకులు వ్యవహరించాల్సిన విధానంపై (డూస్‌ అండ్‌ డోంట్స్‌) బాగా కనిపించే చోట్ల బోర్డులు ఏర్పాటుచేయాలి. * కొవిడ్‌-19 సోకే ముప్పు ఎక్కువ ఉన్న సిబ్బందిని ప్రేక్షకులతో ప్రత్యక్ష సంబంధ కార్యకలాపాల్లో నియమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30DnFwc

No comments:

Post a Comment

'Tesla's chip game is no joke': Elon Musk confirms it has restarted work on its biggest supercomputer yet - but what will it actually be used for?

Tesla restarts Dojo 3 with AI5-AI7 chips, aiming to power autonomous vehicles, humanoid robots, data centers, and space-based AI compute. ...