ఈ ఏడాది చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పలు ఆరోగ్య కారణాలతో మరణిస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యువ నటి కన్నుమూసిందనే వార్తతో బాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు సినిమాల్లో ఐటమ్ నంబర్స్ చేసి ఆకట్టుకున్న ఆమె.. కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించినట్లు తెలిసింది. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపుతున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మిష్టీ ముఖర్జీ.. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. బరువు తగ్గేందుకు గాను కిటో డైట్ ఫాలో అయిన ఆమె, ఆ కిటో డైట్ వికటించడం కారణంగానే కిడ్నీ ఫెయిల్యూర్ అయి మరణించినట్లు సమాచారం. శరీరంలో కిడ్నీ సహకరించకపోవడంతో చివరి రోజుల్లో ఆమె తీవ్ర నొప్పిని భరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2012లో సినీ కెరియర్ ప్రారంభించిన మిష్టీ ముఖర్జీ.. దాదాపు దశాబ్దకాలం పాటు సినీ ఇండస్ట్రీలో పలు పాత్రలు పోషించింది. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలు కూడా వచ్చాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3neIGqQ
No comments:
Post a Comment