సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అవకాశాలు వచ్చినంత కాలం వైభవంగా బ్రతికి చివరి దశలో తినడానికి తిండి కూడా లేక అల్లాడిన ఎందరినో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నటుడు ఫరాజ్‌ఖాన్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ‘మెహందీ’, ‘ఫరేబ్’ చిత్రాల్లో హీరోగా రాణించిన ఫరాజ్‌ఖాన్ ప్రస్తుతం వైద్యం కూడా చేయించుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరు కన్నింగ్‌హాం రోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన దగ్గుతో చావుబతుకుల మధ్య ఉన్న ఫరాజ్‌ఖాన్‌కు వైద్యం చేయించేందుకు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. వారం రోజులు ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తుండంతో వారి వద్దనున్న డబ్బంతా ఖర్చయిపోయింది. దీంతో ఫరాజ్‌ఖాన్ వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలంటూ ఆయన సోదరుడు ఫామన్ ఖాన్ కోరుతున్నాడు. అన్న వైద్యం కోసం ఆయన ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్ ఎంచుకున్నాడు. Also Read: ‘ఫరాజ్ సినీ కెరీర్ చాలా ఏళ్ల క్రితమే ముగిసిపోయింది. చిన్న జాబ్ చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం రూ.25లక్షలు అవసరం’ అని ఫామాన్ ఖాన్ తెలిపాడు. దీనిపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా భట్ స్పందించారు. ఫరాజ్ చికిత్స కోసం తనవంతు సాయం చేస్తున్నానని.. ఇతర సినీనటులు, అభిమానులు కూడా ఆ కుటుంబానికి తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు. ఫరాజ్‌ఖాన్ తండ్రి యూసఫ్‌ఖాన్ కూడా అనేక సినిమాల్లో నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ImzzV1
No comments:
Post a Comment