బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ నవ్వులు పూయిస్తున్న ‘’ ప్రోగ్రామ్ కరోనా కోరల్లో చిక్కుకుంది. అందులో నటించే ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మికి కరోనా సోకినట్లు వార్తలు రాగా.. తాజాగా కరోనాకు చిక్కినట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్‌కు కరోనా వైరస్ సోకడానికి ముందే హైపర్ ఆది కూడా కోవిడ్ బారిన పడ్డారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన ఇప్పటికే కోలుకున్నట్లు సమాచారం. Also Read: అయితే ఇది కేవలం అనధికారికంగా జరుగుతున్న ప్రచారమే కావడం, ఎవరూ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో హైపర్ ఆది ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో మరికొందరికి కూడా ఇలాంటి లక్షణాలు ఉండటంతో షూటింగ్ వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఇటీవల అన్ని టీవీ ఛానెళ్లు భారీ కార్యక్రమాలు రూపొందించాయి. కొందరు జబర్దస్త్ ఆర్టిస్తులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో టీవీ నటులందరికీ ఇప్పుడు కోవిడ్ భయం పట్టుకుంది. దీంతో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు ఇతర టీవీ ఛానళ్ల నటులు, టెక్నీషియన్స్ కోవిడ్ టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. Also Read: అన్‌లాక్‌లో భాగంగా జూన్ నెల నుంచి టీవీ సీరియళ్లు, ఇతర కార్యక్రమాల షూటింగులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే నవ్యస్వామి, రవికృష్ణ, సింగర్ స్మిత, మాళవిక, సాక్షి శివ తదితరులు కరోనా బారిన పడ్డారు. తాజాగా హీరో రాజశేఖర్ దంపతులతో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు కూడా కరోనా సోకింది. వీరిలో శివానీ, శివాత్మిక, జీవిత కోలుకోగా.. రాజశేఖర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, పరిస్థితులు మామూలు స్థితికి చేరుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో టీవీనటులు, టెక్నీషియన్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dOexu4
No comments:
Post a Comment