సీనియర్ హీరో శరత్‌కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తొలినాళ్లలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా బరువు పెరగడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రూటు మార్చి విలనిజం చూపించడం మొదలుపెట్టింది. దీంతో లేడీ విలన్‌గా ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నటనపై బోరు కొట్టిందో ఏమో వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవతారమెత్తింది. ‘కన్నామూచ్చి’ అనే తమిళ సినిమాతో ఆమె డైరెక్టర్‌గా మారబోతోంది. ‘కన్నామూచ్చి’ అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను తేనాండల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను వరలక్ష్మి విడుదల చేసింది. ‘ఫైనల్‌గా దర్శకురాలిగా కొత్త అవతారంలోకి అడుగుపెడుతున్నాను. దర్శకురాలిగా కష్టపడి నేనేంటో నిరూపించుకుని, మీ అందరి ముందు తలెత్తుకుని నిలబడతా’’ అని ఆమె ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T3hSMo
No comments:
Post a Comment