Sunday, October 4, 2020

Drugs Racket: డ్రగ్స్ కేసులో దుమారం.. దీపికా బయటపెట్టిన ఆ ముగ్గురు హీరోలు వీళ్ళే!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూ బీ టౌన్ వర్గాలను వణికిస్తోంది. సినీ తారల డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ మాఫియాతో వారి సంబంధాలపై ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు షాకిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే నార్కోటిక్ అధికారుల ముందుకు వెళ్లిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. ముగ్గురు కోస్టార్ల పేర్లను కోడ్ చేస్తూ ''ఏ, ఎస్, ఆర్'' అనే నేమ్స్‌ వెల్లడించినట్లు సమాచారం. ఈ ముగ్గురూ గ‌తంలో దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన‌వారేన‌ని మ‌రో హింట్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ కోడ్స్‌లో ‘ఎస్’ అంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అని, ‘ఏ’ అంటే అర్జున్ రాంపాల్ అని మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇకపోతే ‘ఆర్’ అనే కోడ్‌పై ఎవ్వరి పేరు బయటకు రానప్పటికీ దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే డ్రగ్స్ ఇష్యూ స్టార్ హీరోలకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: మరోవైపు దీపికా వెల్లడించిన ఆ ముగ్గురు హీరోలకు సమన్లు జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. వీళ్ళే కాకుండా కరణ్ జోహార్ సహా మరో ఏడుగురు కీలక వ్యక్తుల పేర్లు కూడా ఎన్‌సీబీ అధికారుల లిస్టులో ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ అంశంపై అందరినీ లోతుగా విచారించాలని ఫిక్స్ అయ్యారట అధికారులు. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకోగా.. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులను విచారించి వారి మొబైల్ ఫాన్స్ స్వాధీన పర్చుకున్నారు ఎన్‌సీబీ అధికారులు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SrAghA

No comments:

Post a Comment

Humanoid robots are 'stepping out of the lab and into the real world' to take the jobs we don't want - so get ready for the rise of the robot coworkers

Humanoid robots are entering real workplaces due to labor shortages, falling costs, and technical progress, though large-scale adoption rema...