Saturday, October 17, 2020

Khiladi FirstLook: 'ఖిలాడి' రవితేజ యమ స్టైలిష్‌గా ఉన్నాడే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

హిట్టు ఫట్టు అనేది లెక్కచేయకుండా వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్న మాస్‌ మహారాజా మరో ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ''గా తన అభిమానులను అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్ స్టెప్‌ వేస్తూ కనిపిస్తున్న రవితేజ యమ అట్రాక్ట్ చేస్తున్నారు. ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/346u9Wz

No comments:

Post a Comment

'It’s an awesome robot. It looks like a human. People could be easily confused that it’s a human' — Tesla exec on why Optimus 3 is a game changer

Tesla makes big shift to focus on AI and robotics, promising a very human-like Optimus 3 by March — but what does that really mean? from L...