ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్‌పై యంగ్ హీరోయిన్ ఆరోపణలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా చెప్పుకునే ఆయన అమాయక మహిళల జీవితాలు నాశనం చేసే డాన్ అని, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని పేర్కొన్న లువియానా లోధ్.. జోలికెళ్తే ఎవ్వరికైనా ఆఫర్స్ రాకుండా చేస్తారని చెబుతూ తన ఆవేదన వెళ్లగక్కింది. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మహేష్ భట్ క్యారెక్టర్ గురించిన చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో మహేష్ భట్ తరఫు న్యాయవాది లువియానా ఆరోపణలపై స్పందించారు. మహేష్ భట్‌పై యంగ్ హీరోయిన్ లువియానా లోధ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఆమె వ్యాఖ్యలు మహేష్ భట్ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని అన్నారు. దర్శకుడు మహేష్ భట్ దీనిపై రియాక్ట్ అవుతూ ఆమె ఆరోపణలను ఖండిచారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తూ మహేష్ భట్ పరువుకు నష్టం కలిగిస్తున్న లువియానా లోధ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Also Read: కాగా, తాను మహేష్ భట్ సమీప బంధువు సుమిత్ సభర్వాల్‌ను వివాహం చేసుకొన్నానని.. అయితే ఆ తర్వాత ఆయన డ్రగ్స్, అమ్మాయిలను ప్రముఖులకు సప్లై చేస్తారనే విషయం తెలిసి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డానని లువియానా లోధ్ ఆరోపించింది. ఇది తెలిసి మహేష్ భట్ సహా కొంతమంది తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని పేర్కొంది. తన, తన కుటుంబ భద్రత కోసమే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీంతో బీ టౌన్ వర్గాల్లో మరోసారి మహేష్ భట్ ఇష్యూ చర్చల్లో నిలిచింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mhVRGg
No comments:
Post a Comment