Tuesday, November 10, 2020

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్‌తో సినిమా లేనట్టే!

యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌‌’ షూటింగులో తీరిక లేకుండా ఉన్న ఆయన ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో నటించనున్నారు. దీంతో పాటు ఆయన ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించే అవకావం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ముందుకెళ్లేలా కనిపించడం లేదు. ప్రస్తుతం చేయాల్సిన సినిమాలకే సుమారు రెండేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పాలని ప్రభాస్ ఆలోచనగా తెలుస్తోంది. తన వద్దకు వచ్చే దర్శక నిర్మాతకు ప్రభాస్ టీమ్ ఇలాగే చెప్పి పంపిచేస్తోందట. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా కష్టమేనని తెలుస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IfBc7v

No comments:

Post a Comment

'It’s an awesome robot. It looks like a human. People could be easily confused that it’s a human' — Tesla exec on why Optimus 3 is a game changer

Tesla makes big shift to focus on AI and robotics, promising a very human-like Optimus 3 by March — but what does that really mean? from L...