Sunday, November 1, 2020

ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్.. రాజమౌళి బంపరాఫర్!!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగాలుగా తెరకెక్కుతోన్న RRR మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. అయితే, ఈ సినిమా గురించి తాజాగా ఒక రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. RRRలో సరసన మరో హీరోయిన్ కూడా ఉందని టాక్. ఎన్టీఆర్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ నటి ఒలీవియా మోరిస్‌ను రాజమౌళి ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ అమ్మాయిగా ఒలీవియా నటిస్తున్నారు. అయితే, ఓ గోండు తెగ అమ్మాయి కూడా భీమ్‌ను ఇష్టపడుతుందట. ఆ అమ్మాయి పాత్రలో ప్రతిభావంతురాలైన ఐశ్వర్య రాజేష్‌ను రాజమౌళి తీసుకున్నారని అంటున్నారు. ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఐశ్వర్య రాజేష్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో సువర్ణ పాత్రతో అందరినీ కట్టిపడేశారు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’లో నాని సరసన నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, RRRలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజాం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రను తీసుకొని దానికి కల్పిత కథను జతచేస్తున్నారు రాజమౌళి. ఇటీవల విడుదలైన టీజర్‌లో భీమ్‌ను ముస్లింగా చూపించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక, ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆయన సరసన సీతగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కనిపించనున్నారు. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యం.యం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gn5Fzy

No comments:

Post a Comment

'Our viewpoint is that we are trying to help consumers around the world': Micron finally breaks silence on claims it abandoned customers by dropping the Crucial memory brand

Micron confirms Crucial exit while emphasizing ongoing consumer support, highlighting enterprise DRAM growth and persistent shortages throug...