Tuesday, November 10, 2020

పవన్ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్ లాంచ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న శ్రియ

శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ సహా పలువురు ప్రముఖ నటీనటులతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో సుజన రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, విశేషాలు.. ‘గమనం’పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ఉదయం 09.09 గంటలకు విడుదల చేశారు. ఐదు భాషలకు సంబంధించి ఆయా భాషల్లో అగ్రనటులతో ‘గమనం’ ట్రైలర్‌ను లాంచ్ చేయించిన యూనిట్. తెలుగులో పవర్ స్టార్‌ , హిందీలో సోనూసూద్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్‌కుమార్, మలయాళంలో పహాద్ ఫైసల్.. ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్‌ మనసుకు హత్తుకునేలా ఉంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఓ రోజు రాత్రి కురిసిన భారీ వీరందరి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నది సినిమాలో చూపించనున్నారు. ‘నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా.. నీకు వినపడదని నాకేం తెలుసు’ అంటూ శ్రియ చెబుతున్న డైలాగ్ ఆమె పడే కష్టాలను ప్రతిబింబిస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2K0jky1

No comments:

Post a Comment

Waiting for the Galaxy S26? I have the perfect T-Mobile deal to tempt you into picking up a Google Pixel 10 Pro XL instead

T-Mobile's current deal on the Google Pixel 10 Pro XL gets you this superb device for free with a new unlimited line - without a trade-i...