నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొడుకును వెండితెరకు పరిచయం చేయడానికి బాలకృష్ణ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇప్పటికే బోలెడన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు, తన నట వారసుడిని పరిచయం చేయడానికి స్టార్ డైరెక్టర్ల పేర్లను బాలయ్య పరిశీలిస్తున్నారని కూడా అంటున్నారు. ఏదేమైనా నందమూరి నట వారసుడి ఎంట్రీ అదిరిపోవాలని, బాక్సాఫీసులు బద్దలైపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ లుక్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆయన ఇంకా సినిమాలకు సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతోంది. నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ లుక్ బుధవారం బయటికి వచ్చింది. తండ్రికి కేక్ తినిపించి, బహుబతి అందజేస్తోన్న మోక్షజ్ఞ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ బాగా లావుగా ఉన్నారు. ఆయన బాడీ షేప్ హీరో కావడానికి ఏ మాత్రం పనికిరాని విధంగా ఉంది. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read: యాంటీ ఫ్యాన్స్ మోక్షజ్ఞ లుక్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. ఈ వయసుకి మిగిలిన నందమూరి హీరోలు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేశారు. కానీ, మోక్షజ్ఞ మాత్రం సిద్ధంగా లేరు. మరి, ఆయన ఎంట్రీ బాలకృష్ణ చేస్తోన్న ప్రయత్నాలపై వచ్చిన వార్తలన్నీ వదంతులేనా? వాటిలో నిజం లేదా? అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉంటే మోక్షజ్ఞ తన బాడీని ఇలా మెయింటెయిన్ చేసేవారు కాదు కదా అని చాలా మంది అంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన కుమారుడి లుక్ హాట్ టాపిక్ అయ్యింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e3VD1y
No comments:
Post a Comment