తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న నిర్మాతల్లో ఒకరు. బడా నిర్మాత అల్లు అరవింద్‌కు నమ్మిన బంటుగా.. హిట్ల మీద హిట్లు కొడుతోన్న యువ నిర్మాతగా బన్నీ వాస్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంతకీ ఎవరీ బన్నీ వాస్? ఈయనకి అల్లు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? ఆయన నిర్మాతగా ఎలా మారారు? అనే విషయాలు చాలా మందికి తెలియవు. అందుకే, ఈరోజు (జూన్ 11) బన్నీ వాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మీతో పంచుకుంటున్నాం. బన్నీ వాస్ అసలు పేరు ఉదయ్ శ్రీనివాస్. అల్లు అరవింద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బన్నీ వాస్ పుట్టారు. అక్కడే 10వ తరగతి వరకు చదివారు. ఆ తరవాత ఉన్నత చదువుల కోసం విశాఖపట్నం, ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలో ఆపేశారు. ఇలాంటి సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్‌కు పరిచయమయ్యారు ఉదయ్ శ్రీనివాస్. అప్పటికి బన్నీ తొలిచిత్రం ‘గంగోత్రి’ చేశారు. బన్నీతో పరిచయం తరవాత శ్రీనివాస్ వెనుదిరిగి చూడలేదు. అల్లు ఫ్యామిలీ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా ఎదిగారు. Also Read: బన్నీకి స్నేహితుడు కావడంతో ఇండస్ట్రీలో సన్నిహితులందూ బన్నీ వాస్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఉదయ్ శ్రీనివాస్.. బన్నీ వాస్‌గా ఫేమసయ్యారు. వెబ్ మీడియాలో ఉన్నప్పుడు దర్శకుడు మారుతికి బన్నీ వాస్ స్నేహితుడు. ‘ఆర్య’ చిత్రంలో బన్నీ వాస్ ఒక చోట తళుక్కుమన్నారు. ఆ చిత్రం ఆయన కెరీర్‌ని మార్చిందనే చెప్పాలి. ‘ఆర్య’ చిత్రం పాలకొల్లు రైట్స్ కోసం వెళ్ళిన బన్నీ వాస్‌కి నిర్మాత దిల్ రాజు సపోర్టు చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్టమెదటి సారిగా డిస్ట్రిబ్యూటర్‌గా అవతారమెత్తారు. ఆ తరవాత వరుస చిత్రాలు చేస్తూ గుంటూరు జిల్లాలో కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసి సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరుగాంచారు. ఆ తరవాత గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మెట్టమెదటి సారిగా యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ‘100% లవ్’ చిత్రంతో నిర్మాతగా మారటమే కాకుండా తరవాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ విజయంతో సూపర్ హిట్ ప్రోడ్యూసర్‌గా క్రేజ్‌ని సంపాదించారు. ఆ తరవాత జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో నాని హీరోగా ‘భలే భలే మగాడివోయ్’, అల్లు శిరిష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’, విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’, సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ ఎనర్జిటిక్ ప్రొడ్యూసర్‌గా బన్నీ వాస్ తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. Also Read: ప్రస్తుతం నిర్మాతగా అఖిల్ అక్కినేనితో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, కార్తికేయ హీరోగా ‘చావు కబురు చల్లగా’, యంగ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్‌తో ‘18 పేజీస్’ సినిమాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ సిట్టింగ్ దశలో ఉన్నాయి. ఈరోజు బన్నీ వాస్ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకుంటున్నారు. ఆయన మరిన్ని హిట్ సినిమాలు తీయాలని, నిర్మాతగా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బన్నీ వాస్ గారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UzbbTr
No comments:
Post a Comment