Friday, July 17, 2020

ప్రభాస్ ప్రభంజనం... మరో రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. అతి కొద్దిమంది సెలబ్రిటీలకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. బాహుబలి సిసిమాతో స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ కాదే.. హాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కు అభిమానులు ఉన్నారు. ఇక జపాన్‌లో కూడా ప్రభాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ సినీ స్టార్లలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి'తో ప్రభాస్ ఒక ప్రభంజనాన్నే సృష్టించాడు. ఈ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ తన దూకుడు పెంచాడు. ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ప్రభాస్ ఫాలోవర్ల సంఖ్య 1.6 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న సెలెబ్రిటీ ప్రభాస్ కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే... గత 7 రోజుల వ్యవధిలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 లక్షలు పెరిగింది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఇలా కొత్త రికార్డు క్రియేట్ చేయడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Read More: మరోవైపు గోపికృష్ణ బ్యానర్‌పై జిల్ ఫేం రాధాకృష్ణ ప్రభాస్‌తో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్‌ను ఖరారు చేసి.. ఇటీవలే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రావడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/399Edz9

No comments:

Post a Comment

Microsoft has finally fixed a bizarre issue that saw it reroute traffic to an obscure Japanese company - so what exactly went wrong?

Microsoft’s email autoconfiguration routed example.com traffic to Japanese servers, exposing long-standing gaps in oversight and configurati...