ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న .. ఇప్పుడు సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో రెడీ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న '' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. అప్పటినుంచీ ఈ మూవీలో మహేష్ క్యారెక్టర్ విషయమై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం బలమైన కథ రాసుకున్న పరశురామ్.. హీరోని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో చూపించి థ్రిల్ చేసేలా ప్లాన్ చేశారట. ఈ మేరకు మహేష్ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు లేటెస్ట్ టాక్. సాఫ్ట్ అండ్ హార్డ్ రెండు కోణాల్లో మహేష్ అభినయం ప్రేక్షకులను మిస్మరైజ్ చేయనుందని అంటున్నారు. అలాగే కామెడీ సన్నివేశాలు పుష్కలంగా పెట్టడమే గాక థియేటర్స్ దద్దరిల్లిపోయే మ్యూజిక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మహేష్ కెరీర్‌లోనే అన్ని కోణాల్లో ఈ సినిమా ది బెస్ట్ అనిపించేలా ఉండాలని పరశురామ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారనేది ఫిలింనగర్ సమాచారం. Also Read: ఇకపోతే ఈ చిత్రంలో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని కన్ఫర్మ్ చేయగా, మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణాలు ఫోకస్ చేస్తూ ఓ విలువైన మెసేజ్ ఇవ్వబోతున్నారట పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ 'సర్కారు వారి పాట' మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ అతిత్వరలో ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h0HdQO
No comments:
Post a Comment