అసలే బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న నటీనటుల పేర్లు సినీ లోకాన్ని వణికిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఓ ఆటం బాంబు విసురుతూ ఏకంగా క్రికెటర్ల భార్యలపై షాకింగ్ కామెంట్స్ చేసింది బోల్డ్ బ్యూటీ . స్టార్ హీరోయిన్ల మెడకు చుట్టుకుంటున్న డ్రగ్స్ రాకెట్‌ని క్రికెటర్ల వద్దకు తీసుకెళ్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం జరుగుతున్న తతంగం అంటూ గుట్టు బయటపెట్టింది. షెర్లిన్ చేసిన ఈ ఆరోపణలు విని షాక్ అవుతున్నారు జనం. ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి తాను కోల్‌కతా వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు కళ్లారా చూశానని చెబుతూ ఆటం బాంబు పేల్చింది షెర్లిన్ చోప్రా. మ్యాచ్ తర్వాత జరిగిన ఓ పార్టీకి తనను ఆహ్వానిస్తే వెళ్లానని, ఆ పార్టీకి స్టార్ క్రికెటర్లు, వారి భార్యలు కూడా వచ్చారని చెప్పిన షెర్లిన్.. అక్కడ వాళ్ళు తమ భార్యలతో కలిసి చేస్తున్న నిర్వాకం చూసి షాకయ్యానని చెప్పింది. పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసి వాష్ రూమ్ వెళదామని అక్కడికి వెళ్లగా.. అక్కడ కొకైన్ తీసుకుంటూ కనిపించారని తెలిపింది. Also Read: ఆ స్టార్ క్రికెటర్ల భార్యలు తనను చూసి ఓ నవ్వు నవ్వి తమ పని తాము చేసుకున్నారని షెర్లిన్ తెలిపింది. ఇక పురుషుల వాష్ రూములోనూ ఇదే సీన్ ఉండొచ్చని అక్కడి వాతావరణం చూస్తే అనిపించిందని పేర్కొంది. దీంతో తాను ఆ పార్టీలో ఉండటం అంత మంచిదికాదని గ్రహించి వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. ఆ క్రికెటర్లు ఎవరనేది మాత్రం వెల్లడించని ఆమె.. ఎన్‌సీబీ అధికారులు అడిగితే పూర్తి వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం మరో సంచలనంగా మారింది. ఇకపోతే ఇప్పటికే డ్రగ్స్ ఉచ్చులో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్ చిక్కుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వీరికి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో షెర్లీన్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HwhPGr
No comments:
Post a Comment