ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలంతా బాలీవుడ్ హీరోలకు ధీటుగా కండలు పెంచి అట్రాక్ట్ చేస్తున్నారు. కొత్తగా మేకోవర్ అయ్యేందుకు జిమ్, వ్యాయామం అంటూ భారీగా కసరత్తులు చేస్తున్నారు. పైగా గత 5 నెలలుగా షూటింగ్స్ లేక ఖాళీ సమయం దొరకడంతో అందరూ తమ తమ ఫిజిక్‌పై దృష్టి పెట్టారు. ఇప్పటికే V మూవీలో సుధీర్ బాబు కండలు పెంచి వావ్ అనిపించగా.. తాజాగా మరో యంగ్ హీరో, కొత్త పెళ్లి కొడుకు జిమ్ బాడీతో కూడిన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేసి పరేషాన్ చేశాడు. లాక్‌డౌన్ వేళ తన ఇష్ట సఖి పల్లవి వర్మను పెళ్లాడిన నిఖిల్.. కండలు పెంచడంపై ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇకపై సినిమాల్లో సిక్స్ పాక్స్ లుక్‌తో కనిపించాలని డిసైడ్ అయ్యారట. తాజాగా తన లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన 'సూపర్ డ్రై' అని ట్యాగ్ చేశాడు. ఈ పిక్‌లో చొక్కా జిప్ తీసేసి తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ యమ స్టైల్‌గా కనిపిస్తున్నాడు నిఖిల్. నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ప్రస్తుతం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వల్ కార్తికేయ- 2 రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ అతిత్వరలో తిరిగి ప్రారంభం కానుంది. దీంతో పాటు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో '18 పేజీస్' సినిమాలో నటించనున్నాడు నిఖిల్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jPZZvN
No comments:
Post a Comment