Monday, September 7, 2020

Jayaprakash Reddy Died: ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులో ఉన్న తన స్వగృహం లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలిసి టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడుతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టారు. 1997లో విడుదలైన 'ప్రేమించుకుందాం రా' చిత్రంతో ప్రతినాయకునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ''సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు'' లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. ''జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, నిజం, ఛత్రపతి, సీతయ్య, విక్రమార్కుడు, పలనాటి బ్రహ్మనాయుడు, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, సుప్రీమ్, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌'' లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన జయప్రకాశ్ రెడ్డి.. తన రాయలసీమ యాస, భాషతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై తనదైన మార్క్ వేసుకున్న ఆయన.. చివరగా మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కనిపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R5i4tu

No comments:

Post a Comment

Samsung's 12 best Super Bowl TV deals that I recommend buying — up to $2,000 off 4K, QLED, and OLED TVs

Samsung's Super Bowl TV sale is live, and I'm rounding up today's 12 best deals I recommend for watching the big game, including...