టీచర్స్ డే (సెప్టెంబర్ 5) సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మెగా బ్రదర్ . తన సొంత యూ ట్యూబ్ ఛానల్ 'మన ఛానల్ మన ఇష్టం' ద్వారా ఆ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో డా. సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని చెబుతూ ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు. తనకు పాఠాలు చెప్పిన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ తన కూతురు గురువు శైలజ గురించి వివరంగా చెప్పారు నాగబాబు. మనిషి జీవితంలో గురువుకు చాలా ఉన్నతమైన స్థానం ఉంటుందని చెప్పిన నాగబాబు.. వ్యక్తిత్వ వికాసంలో టీచర్ పాత్ర ఎంతో విలువైందని అన్నారు. ఈ రోజు నిహారిక వ్యక్తిత్వానికి ఓ గురువే కారణం అని చెబుతూ ఆమె గురువు శైలజ గురించి చెప్పుకొచ్చారు. నిహారిక చిన్నతనంలోని టీచర్, ఫ్యూచర్ కిడ్స్ ప్రిన్సిపల్ శైలజ తన స్టూడెంట్స్ అందరితో ఇప్పటికీ టచ్‌లో ఉంటారని తెలుపుతూ ఆమె గురించి వివరించారు నాగబాబు. ఆమెకు ఎవ్వరూ టీచర్ అని పిలవరని, శైలజా ఆంటీ అని పిలుస్తారంటే ఆవిడ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చని నాగబాబు చెప్పుకొచ్చారు. Also Read: ఆవిడ పిల్లలకు చెప్పే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు పిల్లల వ్యక్తిత్వ ఉన్నతిలో కీలకం అని నాగబాబు అన్నారు. నిజంగా ఈ రోజు నా కూతురు నిహారిక గుడ్ గర్ల్‌లా తయారవడానికి కారణం.. మా పెంపకం ఒకెత్తయితే వాళ్ల టీచర్ శైలజ ఇచ్చిన మంచి విద్యాబుద్ధులు మరో ఎత్తు అని చెప్పారు నాగబాబు. తన కూతురు వ్యక్తిత్వం ఇలా ఉండటంలో ఆమెదే కీలకపాత్ర అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఇటీవలే నిహారిక నిశ్చితార్ధ వేడుక పూర్తయిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331lJya
No comments:
Post a Comment