Monday, October 19, 2020

ఆ రీమేక్‌కు నో చెప్పిన పవన్‌ కళ్యాణ్!

ప్రస్తుతం మెగా హీరోలు రీమేకుల బాట పట్టారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇప్పటికే పింక్ రీమేక్‌లో నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు లైన్లో పెట్టడంతో పాటు మూడో రీమేక్‌పైనా కన్నేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్‌కళ్యాణ్‌ కూడా మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. తొలుత ఈ సినిమాలో రవితేజ, రానా కలిసి నటించాలనుకున్నారని, సాగర్ చంద్ర డైరెక్టర్‌గా ఓకే అయినట్లు వార్తలొచ్చాయి. అయితే రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందట. దీంతో ఈ రీమేక్‌పై పవన్ ఆసక్తి చూపించారని, యూనిట్ ఆయన్ని కలిసి స్ర్కిప్ట్ వినిపించగా ఓకే చెప్పేశారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’ రీమేక్ నుంచి పవన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. Also Read: పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింట్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత క్రిష్ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఆయన నటించాల్సి ఉంది. ఆ సినిమాలు పూర్తయ్యేసరికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో తన కోసం యూనిట్ అంత కాలం వేచి ఉండటం ఇష్టం లేకే పవన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TgaugB

No comments:

Post a Comment

Samsung's 12 best Super Bowl TV deals that I recommend buying — up to $2,000 off 4K, QLED, and OLED TVs

Samsung's Super Bowl TV sale is live, and I'm rounding up today's 12 best deals I recommend for watching the big game, including...