టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా ముద్రపడిన రానా, అఖిల్, నితిన్ లాంటి హీరోలు లాక్‌డౌన్ పుణ్యమా అని పెళ్లి పీటలెక్కి ఓ ఇంటివారయ్యారు. అయితే 35ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తకుండా బ్యాచిలర్లుగా జీవితం గడిపేస్తున్న కొందరు నటులకు ఎక్కడికెళ్లినా మీ పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతూ వస్తోంది. ఇలాంటి వారిలో ఒకరు. ఆయన బయట ఎక్కడికెళ్లినా, సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటూ ప్రశ్నలే ఎదురవుతున్నాయంట. Also Read: ఈ ప్రశ్నలతో విసిగిపోయిన నవదీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందరిలా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, సింగిల్‌గా ఇలా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తానని చెప్పుకొచ్చాడు. నవదీప్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. అతడికి నిజంగానే పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? లేక అలాంటి ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు అలా అన్నాడా? అని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నవదీప్ సినిమాలతో పాటు టీవీ షోలలో కనిపిస్తూ బిజీగా మారాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34eG054
No comments:
Post a Comment