సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ప్రత్యేకమైన క్రేజ్. మహానటి సావిత్రి తర్వాత అంతటి గొప్పనటిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తూ ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. Also Read: అసలు విషయానికొస్తే.. కోట్లాది మంది అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. మలయాళంలో భారీ చిత్రాలను తెరకెక్కించే ఓ నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది అన్ని భాషల్లోనే తెరకెక్కే ఈ సినిమా స్ర్కిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ బయోపిక్‌లో సౌందర్య పాత్రలో నటించనున్నట్లు టాక్ బయటికి వచ్చింది. తన అందం, నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులను దోచుకున్న సౌందర్య పాత్రలో నటించాలంటే ఏ నటికైనా సాహసమనే చెప్పాలి. అలాంటి ఛాన్స్ సాయిపల్లవిని నిజంగా వరిస్తే ఆమె అదృష్టంగా భావించవచ్చు. అయితే ఇదంతా ప్రస్తుతం రూమర్ మాత్రమే. ఇది నిజమా? కాదా? అన్నది? నిర్మాణ సంస్థ ప్రకటించాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nIUxh1
No comments:
Post a Comment