పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి తాను భక్తుడిననని చెప్పకునే నిర్మాత ఆయనతో ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల తన దేవుడు పవన్‌కళ్యాణ్‌ని కలిశానని, ఆయన ఓకే చెప్పారని, చాలా సంతోషంగా ఉందటూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసబెట్టి సినిమాలు తీస్తున్న పవన్‌కళ్యాణ్ తన భక్తుడికి కూడా ఛాన్స్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఈ సినిమా కోసం మంచి డైరెక్టర్‌ని సెట్ చేసుకోవాలని, పవన్ ఇచ్చిన ఛాన్స్‌ను వృథా చేసుకోవద్దంటూ చాలామంది ఆయన సలహాలు ఇస్తున్నారు. Also Read: ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఆదివారం(అక్టోబర్ 11) చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘వీపుమీద కొట్టండి .కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి. ఇది నా విన్నపం. దయచేసి నేను చెప్పే వరకు ఏ విధమైన వార్తలు రాయొద్దు ఇది నా అభ్యర్థన’. అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ వెనకున్న అర్థం ఏమిటోనన్న చర్చ నడుస్తోంది. పవన్‌కళ్యాణ్‌తో ఆయన తీయబోయే సినిమా గురించి రోజుకొక పుకారు షికారు చేస్తోంది. దీనిపైనే ఆయన హర్ట్ అయి ఈ విధంగా ట్వీట్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ విషయంలో జరుగుతున్న ప్రచారం వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని భావించే బండ్ల గణేష్ అలా ట్వీట్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GNqOD7
No comments:
Post a Comment